హోళీ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): హోళీ పండుగను పురస్కరించుకుని, జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి హోళీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆనందం కలిగేలా, శాంతి, సామరస్యంతో హోళీ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. హోళీ అనేది ప్రేమ, స్నేహానికి, భిన్నత్వంలో ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. రసాయనిక పదార్థాలు కలిగిన రంగుల బదులుగా సహజమైన, ఆరోగ్యానికి హాని కలిగించని రంగులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఎక్కువగా నీటిని వృథా చేయకుండా హోళీ జరుపుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment