హాస్టల్ వార్డెన్ కూలీగా మారి పిచికారీ కొడుతూ…!
హాస్టల్ వార్డెన్ రమేష్ కు పలువురి అభినందనలు…
ఇటీవలే నూతనంగా బాధ్యతలు చేపట్టిన హాస్టల్ వార్డెన్…
ప్రశ్న ఆయుధం 03 జూలై ( బాన్సువాడ ప్రతినిధి)
బాన్సువాడ పట్టణంలోని సాయికృప నగర్ లో గల ఎస్టీ బాలుర కళాశాల వసతి గృహంలోని పరిసర ప్రాంతంలో ఇటీవలే నూతనంగా వార్డెన్ గా బాధ్యతలు చేపట్టిన రమేష్ వర్షాకాలం నేపథ్యంలో పిచ్చి మొక్కలు పెరుగదలను అరికట్టేందుకు స్వయంగా తానే భుజానా పిచికారీ పంపు వేసుకొని క్రిమిసంహారక మందు పిచికారీ చేశారు.ఈ సందర్బంగా వార్డెన్ మాట్లాడుతూ…వర్షాకాలంలో హానికరమైన కీటకాల నుండి రక్షించడానికి గడ్డిపై పిచికారీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.హాస్టల్ వార్డెన్ పిచికారీ చేయడంతో పలువురు కాలనీ వాసులు ఆయనను అభినందించారు.హాస్టల్ వార్డెన్ పిచికారీ చేయడం ఏంటని పలువురు అడగగా..నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినే అనీ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.దింతో ఈ పిచికారీ చేసిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది.