*గుడికి లోపల భూమిని కూడా వదలని హౌసింగ్ బోర్డ్ అధికారులు*
ప్రశ్న ఆయుధం జులై18: కూకట్‌పల్లి ప్రతినిధి
బాలాజీ నగర్ డివిజన్ కె.పి.హెచ్.బి కాలనీ మూడవ రోడ్డులో ఉన్నటువంటి వరసిద్ధి వినాయక ఆలయ ప్రాంగణంలోని ఖాళీ స్థలాన్ని అమ్మకానికి పెట్టాలని చూస్తున్నారు హౌసింగ్ బోర్డ్ అధికారులు. ఆలయ ప్రాంగణం లోపల ఉన్నటువంటి ఖాళీ స్థలానికి ప్రహరి గోడ కట్టాలని హౌసింగ్ బోర్డ్ అధికారులు రావడంతో స్థానికంగా ఉన్నటువంటి భక్తులు బిఆర్ఎస్ నాయకులు అడ్డుకొని దేవాలయానికి సంబంధించిన స్థలాన్ని ఏ విధంగా ప్రహరీ నిర్వహిస్తారని వాగ్వాదానికి దిగి జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఎట్టి పరిస్థితులలో ఆలయ భూమిని ప్రహరీ నిర్మించి అమ్మకానికి పెట్టాలని చూస్తే ఊరుకోమని మహిళా భక్తులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుడికి లోపల భూమిని కూడా వదలని హౌసింగ్ బోర్డ్ అధికారులు
by Madda Anil
Published On: July 18, 2025 9:08 pm