ప్రశ్నిస్తే దేశద్రోహి అంటుంది ఈ వ్యవస్థ

ప్రశ్నిస్తే దేశద్రోహి అంటుంది ఈ వ్యవస్థ

               నటుడు అమోల్ పాలేకర్

 

నేటి వాతావరణం చూస్తుంటే ప్రభుత్వానికి, వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించే వ్యక్తి దేశద్రోహి అవుతాడు. వారిపై దాడి చేస్తారు. అతను ట్రోల్ చేయబడతాడు. ఐతే ప్రజాస్వామ్యంలో వ్యతిరేక అభిప్రాయాన్ని కలిగి ఉండటానికి, ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడానికి స్వేచ్ఛవుంది. కాబట్టి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం దేశద్రోహం కాదు. గతంలో వ్యవస్థకు విరుద్ధంగా మాట్లాడటానికి స్వేచ్చ ఉండేది. అయితే ఇప్పుడు ప్రశ్నలు అడిగేవారు చెడ్డ వారై పోయారంటూ,ప్రస్తుత పరిస్థితులపై ప్రఖ్యాత మరాఠీ నటుడు అమోల్ పాలేకర్ వ్యాఖ్యానించారు. బహుజన రంగభూమి సంస్థ నిర్మించిన “గాటర్” నాటకం 100వ ప్రయోగం శనివారం సోమవారం 2రోజుల పాటు ముంబై దాదర్లోని శివాజీ మందిర్లో జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడు తూ, “సమాంతర థియేటర్” 3లక్ష్యాలను కలిగి ఉండాలని,కళాత్మక భావాన్ని మరింత లోతుగా చేయాలి, మన సామాజిక అవగాహన మరింత స్పష్టంగా మరియు రాజకీయంగా ఉండాలంటూ పాలేకర్ సూచించారు. అనంతరం నాటిక రచయిత ప్రేమానంద్ గజ్వీ, దర్శకుడు వీరేంద్ర గన్వీర్ లను సత్కరించారు. 1975- 77 మధ్య ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు, దానికి నిరసనగా తాము “జూలూస్‌” అనే నాటకాన్ని ప్రదర్శించాం. అప్పట్లో 150కి పైగా ప్రయోగాలు గ్రామం నుంచి పల్లెకు వెళ్లి ప్రభుత్వాన్ని వ్యతిరేకించాం. ఆ సమయంలో స్వేచ్చ ఉండేది. భిన్నాభిప్రాయాన్ని కలిగి ఉండటం, ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడం, ప్రశ్నించడం, వ్యతిరేకించడం నిజమైన అర్థంలో ఇదే ప్రజాస్వామ్యం. అలాంటి పరిస్థితికి వ్యతిరేకంగా “గాటర్” లాంటి కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ ఈ నాటిక వచ్చింది. ఇది కొత్త స్ఫూర్తిని ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తపర్చారు.

Join WhatsApp

Join Now