పార్లమెంటుకు రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే భారీగా ప్రజా ధనం ఆదా!

*పార్లమెంటుకు రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే భారీగా ప్రజా ధనం ఆదా!*

*జమిలి ఎన్నికల తో ఎన్నికల నిర్వహణలో సమూల మార్పులు*

*బిజెపి జిల్లా కార్యదర్శి నరసింహారాజు*

*వీణవంక మార్చి 21 ప్రశ్న ఆయుధం*

పార్లమెంటుకు రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి దేశం మొత్తం మీద ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వంపై భారీగా ప్రజాధనం ఆదా అవుతుందని జమిలి ఎన్నికల తో ఎన్నికల నిర్వహణలో సమూల మార్పులు వస్తాయని బిజెపి జిల్లా కార్యదర్శి నరసింహ రాజు అన్నారు. వన్ నేషన్ , వన్ ఎలక్షన్ వర్క్ షాప్ కార్యక్రమం శుక్రవారం రోజున వీణవంక బిజెపి మండల అధ్యక్షుడు బత్తినీ నరేష్ గౌడ్ ప్రోగ్రాం కన్వీనర్, ముత్యాల రవీందర్ అధ్యక్షతన నిర్వహించారు సమావేశానికి హాజరైన జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే సమయం ఆదాతో పాటు రెండుసార్లు ఎన్నికలు జరగకుండా వారంతా పరిపాలనపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలకు తరుచూ ఎన్నికల కోడ్ అడ్డంగా మారడం కూడా తగ్గుతుందన్నారు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటర్ల పోలింగ్ శాతం కూడా గణనీయంగా పెరుగుతుందన్నారు ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 1967 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు జరిగేవని, ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు కావడం, 1970 లో ఏడాది ముందే లోక్ సభ రద్దు చేయడంతో ఈ విధానం మారిపోయింది అన్నారు. జమిలి ఎన్నికలపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి పెద్ది మల్లారెడ్డి ఎంగంటి శ్రీనివాస్ ప్రోగ్రాం కో కన్వీనర్ సిహెచ్ కొండల్ రెడ్డి దాట్ల వీరస్వామి మారం తిరుపతిరెడ్డి పార్లపల్లి స్వామి కర్రె నాని అజయ్ పోతారవేణి శ్రీనివాస్ హరీష్ అప్పని కొమురయ్య ముష్కుల రాజి రెడ్డి రాజు కుమార్ ఉడుత కుమార్ ముత్యాల సతీష్ రమణారెడ్డి, వరి కోల్ రాజు, కొండల్ కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now