కంకోల్ టోల్‌ప్లాజా జాతీయ రహదారిపై అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా మునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి కంకోల్ టోల్‌ప్లాజా వద్ద భారీ స్థాయిలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా బయటపడింది. విజిలెన్స్ అధికారులు దాడి చేసి 597 సంచులు (298 క్వింటాళ్లు) బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ డీఎస్పీ వెంకటేశం మాట్లాడుతూ.. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, నిల్వ, విక్రయం చేసే వారిని ఏ మాత్రం వదలబోమని స్పష్టం చేశారు. ఈ కేసులో విజయవాడకు చెందిన బియ్యం యజమాని రమేష్, లారీ యజమాని సిద్ధప్ప, డ్రైవర్ సునీల్‌పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా పట్టుబడిన బియ్యాన్ని సదాశివపేట ఎమ్ఎల్ఎస్ గోదాంలో జమ చేసినట్లు అధికారులు వివరించారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సీఐ పండరి, ఎస్సైలు వెంకటేశ్వర్లు, సాంబశివరావు, డిటి ప్రభాకర్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment