అగమ్యగోచరంగా ప్రజారోగ్యం.. – ప్రభుత్వ ఆసుపత్రి సేవలు నిర్వీర్యం…

– అగమ్యగోచరంగా ప్రజారోగ్యం..

– ప్రభుత్వ ఆసుపత్రి సేవలు నిర్వీర్యం…

– కెసిఆర్ ప్రభుత్వం లో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత…

– సిద్దిపేట నియోజకవర్గం లో 143మందికి 31లక్షల 67 వేలు సీఎం సహాయ నిది చెక్కులు పంపిణి…

– రూ.2లక్షల ఎల్ వో సి ని అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు

సిద్దిపేట, డిసెంబర్ 25 (ప్రశ్న ఆయుధం ):

ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్య సేవలు అస్తవ్యస్తంగా ఉన్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయం లో సీఎం సహాయ నిది చెక్కులు బుధవారం పంపిణి చేశారు. రూ.2లక్షల రూపాయల ఎల్ వో సి ని అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వంలో ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్య సేవలు అస్తవ్యస్తం అయ్యాయని ఆవేదన చెందారు. కెసిఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసారని, ప్రజా ఆరోగ్యం పడకేసిందన్నారు. ఏ ఆపద వచ్చిన తాను అందుబాటులో ఉంటానని, ప్రయివేట్ ఆసుపత్రి లో ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు సీఎం ఆర్ ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. వివిధ ఆసుపత్రి లో చికిత్స పొందిన వారికి సీఎంఆర్ ఎఫ్ చెక్కులు అందిస్తున్నామని చెప్పారు. సిద్దిపేట నియోజకవర్గంలో 143 మందికి 31 లక్ష 67 వెల రూపాయల చెక్కులని పంపిణి చేశారు. ఎన్సాన్ పల్లి గ్రామానికి చెందిన కేమ్మసారం లక్ష్మికి నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స కోసం రెండు లక్షల రూపాయల ఎల్ వో సినీ హరీశ్ రావు అందజేశారు.

Join WhatsApp

Join Now