Headlines
- గ్రంథాలయాల విజ్ఞాన విలువను సద్వినియోగం చేసుకోండి: చైర్మన్ అంజయ్య
- జహీరాబాద్ గ్రంథాలయం సందర్శనలో చైర్మన్ జి. అంజయ్య కీలక సూచనలు
- గ్రంథాలయాల ప్రాముఖ్యతపై విద్యార్థులకు చైర్మన్ స్ఫూర్తివాక్యాలు
- విజ్ఞాన వనరులుగా గ్రంథాలయాలు: విద్యార్థుల కోసం అన్ని రకాల పుస్తకాల అందుబాటు
- పుస్తక పఠనంతో భవిష్యత్తు నిర్మాణం: గ్రంథాలయ చైర్మన్ అంజయ్య
సంగారెడ్డి ప్రతినిధి, డిసెంబరు 8 (ప్రశ్న ఆయుధం న్యూస్): గ్రంథాలయాలను పాఠకులు సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.అంజయ్య తెలిపారు. ఆదివారం జహీరాబాద్ గ్రంథాలయాన్ని చైర్మన్ జి.అంజయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య మాట్లాడుతూ.. గ్రంధాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని, ప్రతి ఒక్కరూ గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నాడు చదువుకొనుటకు పరిమిత స్థాయిలో పత్రికలు, పుస్తకాలు అందుబాటులో ఉండేవి, నేడు భారతదేశం అన్ని రంగాల్లో ముందుకుపోతున్న వేళ విద్యను అందిపుచ్చుకోవాలని, సూచించారు. భావితరాలను మంచి ఉన్నతంగా నిర్మించుకోవాలని అన్నారు. గ్రంథాలయాలలో చదువుకుని ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని గుర్తు చేశారు. గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని, బాల్యం నుండే పుస్తక పఠనం అలవర్చుకోవాలని, మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్, సిబ్బంది పాల్గొన్నారు.