వజ్జపల్లి గ్రామంలో నూతన పాలకవర్గ కార్యక్రమానికి విశేష స్పందన
సర్పంచ్ కాట్యాడ రాధాబాయి శ్యామ్ రావు
ఉపసర్పంచ్ కయ్యల నర్సింలు నేతృత్వంలో గ్రామాభివృద్ధి దిశగా అడుగులు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 22
వజ్జపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాట్యాడ రాధాబాయి శ్యామ్ రావు, ఉపసర్పంచ్ కయ్యల నర్సింలు పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా సమిష్టిగా పనిచేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కాట్యాడ హరీష్ రావు, గౌండ్ల శ్రీనివాస్ గౌడ్, తూర్పు సునీత, దుస్గం లింగవ్వ, గాదె లక్ష్మి, చేవ్వా ఎల్లయ్య, జెగ్గా సౌందర్య పాల్గొన్నారు. అలాగే ఎంపీడీఓ, గ్రామ కార్యదర్శి హాజరై గ్రామ పాలనపై మార్గదర్శక సూచనలు చేశారు. కాంగ్రెస్ నాయకులు కమలాకర్ రావు, ప్రభాకర్ రావు, గాండ్ల బాలరాజు, ప్రశాంత్ స్వామి కార్యక్రమానికి హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని వారు సూచించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నూతన పాలకవర్గంతో వజ్జపల్లి గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్న ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తం చేశారు.