*మదర్సా అరబియా నోమానీయలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*

*విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేత*

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణ కేంద్రం ప్రశాంత్ నగర్ లోని మదర్సా అరబియా నోమానీయలో 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మదర్సా అరబియా నోమానీయ చైర్మన్, ప్రిన్సిపాల్ ముఫ్తీ అస్లాం సుల్తాన్ ఖాస్మి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా మదర్సా విద్యార్థులతో సంగారెడ్డి పురవీధుల మీదగా ర్యాలీ నిర్వహించి అనంతరం మదర్సాలో జాతీయ జెండాను ఎగర వేశారు. విద్యార్థులకు సాంస్కృతిక పోటీలు, ఏలక్యషన్ కాంపిటీషన్ తో పాటు డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మేమెంటోలు, మెడల్స్ తో పాటు అప్రిసియేషన్ సర్టిఫికెట్స్ లను టీఎన్ జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ జావిద్ ఆలీ, సీనియర్ రిపోర్టర్ మసూద్ ఇంతియాజ్ అహ్మద్ ఖాన్ చేతుల మీదగా విద్యార్థులకు అందజేశారు. స్వాతంత్ర్య సమర యోధుల చరిత్రలు మరియు వారి త్యాగాలను విద్యార్థులకు తెలియజేయడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ముఫ్తీ అస్లాం సుల్తాన్ ఖాస్మీ తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందకరమని, పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మొహమ్మద్ జావిద్ ఆలీ అభినందనలు తెలిపారు. ఈ వేడుకల్లో ముఫ్తీ అకీఫ్, జోహోరోద్దీన్, మహమ్మద్ అంజాద్ అలీ, మొహమ్మద్ సిద్ధిఖ్, మౌలానా నోమాన్, సదర్ ముదరిస్ హఫీజ్ మోయిజ్ ఉద్దీన్, ఖారీ హఫీజ్ ఆశ్వాక్, హఫీజ్ అబ్దుల్లా, హఫీజ్ అబ్రార్, హఫీజ్ ఆమెర్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now