పటాన్‌చెరు పట్టణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి/పటాన్‌చెరు, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పటాన్‌చెరు పట్టణంలోని జీహెచ్ఎంసీ కార్యాలయం, చైతన్య నగర్, సరై, ముదిరాజ్ భవన్, వ్యాయామశాల, లయన్స్ క్లబ్, బ్లాక్ ఆఫీస్, సినర్జీ బ్రిజ్, ఆటో స్టాండ్, ఆల్విన్ కాలనీ తదితర ప్రాంగణాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ ప్రిథ్వీరాజ్ పాల్గొన్నారు. అనంతరం ఎండీఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు, కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ ఎండీఆర్ యువసేన సభ్యులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాదిరి ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వీరమరణాలు, వారి త్యాగ స్ఫూర్తి మనసులో నిలిచి ఉండాలని, యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో పట్టణ ప్రముఖులు, సీనియర్ నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment