*బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*

*జాతీయ పతాకాన్ని ఎగుర వేసిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి*

IMG 20240815 122657
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డి జాతీయ జెండాను ఎగర వేశారు. ఈ సందర్భంగా గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది బలిదానం చేశారని, ఈ దేశ వారి త్యాగాల ఫలితం అని అన్నారు. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మహనీయులను స్మరించుకోవాలని, జాతి ఐక్యమత్యం, దేశాభివృద్ధి కోసం కృషి చేయాలని తెలిపారు. బ్రిటిష్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన రోజు అని, దేశ ప్రజలు విముక్తి పొందిన రోజు అని దేశ ప్రజలు అందరూ చేసుకునే పెద్ద పండుగ అన్నారు. భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం దినదినం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాజేశ్వరరావు దేశ్ పాండే, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట నరసింహారెడ్డి, పోచారం రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్ రావు, రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు మందుల నాగరాజ్, కసిని వాసు, జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ రాజ గౌడ్, జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయకుమార్, మహిళ జిల్లా ప్రధాన కార్యదర్శి మీనాగౌడ్, ద్వారక రవి, పాపయ్య, పుల్లంగారి సురేందర్, సదానంద చారి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎల్లన్న, సాయి రెడ్డి, నరేన్ దేశ్ పాండే, రణధీర్ రెడ్డి, సతీష్, తేజస్విని, లక్ష్మి, సుబ్బలక్ష్మి, సాయి, బిచ్చప్ప, గోవింద్, బాబా చారి, తులసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now