గ్రామ సభల్లో తీర్మానించిన 30వేల పనులకు శ్రీకారం …

5 సంవత్సరాల తర్వాత గ్రామాలలో రోడ్ల పరిస్థితి బాగు చేయడానికి కంకణం పట్టిన పవన్ కళ్యాణ్ 

14వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లె పండుగ’

గ్రామ సభల్లో తీర్మానించిన 30వేల పనులకు శ్రీకారం .

రూ.4500 కోట్లు ఉపాధి హామీ నిధులు వ్యయం 

3 వేల కిమీ సీసీ రోడ్లు, 500 కిమీ తారు రోడ్లు లాంటి పనులు మొదలు 

పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి ..

జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా మొదలుపెట్టాలి. ప్రతి పంచాయతీకి నిధుల సమస్య లేకుండా చూస్తున్నాము. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4500 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ నెల 14వ తేదీ నుంచి పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించి పనులు మొదలుపెట్టాలి’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆగస్టు 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో విప్లవాత్మక రీతిలో నిర్వహించిన గ్రామ సభల్లో ఆమోదించిన పనులు పల్లె పండుగ సందర్భంగా ప్రారంభించాలి అన్నారు.

Join WhatsApp

Join Now