ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో స్ఫూర్తిదాయక పిలుపు — “విధ్వంసాలకు మళ్లీ తావివ్వద్దు”
గతం పాఠంగా తీసుకుని జర్నలిస్టులు జాగ్రత్తగా ముందుకు సాగాలి
ఫోటోలకు మాత్రమే ఫోజులు ఇచ్చే నాయకులు వద్దన్న పత్రికారులు
“జర్నలిస్టుల సమస్యలకు అండగా నిలిచే నాయకత్వం కావాలి” అని పిలుపు
రవి కంటి శ్రీనివాస్‌నే నిజమైన జర్నలిస్టుల నాయకుడని అభిప్రాయం
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి ఓటుతో మార్పు తేవాలని పిలుపు
హైదరాబాద్, అక్టోబర్ 26 (ప్రశ్న ఆయుధం)
ప్రెస్ క్లబ్ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈసారి గతంలోని విభజనలు, విధ్వంసాలకు తావివ్వకూడదన్న స్వరాలు బలంగా వినిపిస్తున్నాయి. “వాళ్ల చరిత్ర కూడా మనకుంది… మన నాయకుల చరిత్ర కూడా మనకు తెలుసు. ఈసారి ఓటుతోనే చరిత్రను మార్చుద్దాం” అంటూ జర్నలిస్టుల వర్గాల్లో చర్చ సాగుతోంది.
జర్నలిస్టుల సమస్యలకు అండగా ఉండే నాయకత్వం అవసరమని, ఫోటోలకు మాత్రమే ఫోజులు ఇచ్చే నాయకులు వద్దని పలువురు స్పష్టంగా చెబుతున్నారు. “జర్నలిస్టులం కదా — సమస్య రాకముందే జాగ్రత్త పడదాం” అనే పిలుపుతో పత్రికారులు ఒకే వేదికపై ఏకమవుతున్నారు.
జర్నలిస్టులకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరుగాంచిన రవి కంటి శ్రీనివాస్‌కు మద్దతు వెల్లువగా మారింది. ఆయన గెలుపుతోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో పారదర్శకత, అభివృద్ధి సాధ్యమని పత్రికారులు నమ్ముతున్నారు.
“మన ఓటుతోనే మార్పు సాధ్యం… మన క్లబ్ మనగడ కోసం తెలివిగా నిర్ణయం తీసుకుందాం” — సీనియర్ జర్నలిస్టుల సందేశం.