ఝరాసంగం కేజీబీవీలో ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేజీబీవీలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది అంతర్జాతీయ బాలికా దినోత్సవం థీమ్ (బాలికల హక్కులపై పెట్టుబడి – మన నాయకత్వం, మన శ్రేయస్సు) నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సౌజన్య హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. జువెనైల్ జస్టిస్ యాక్ట్ మరియు పోక్సో యాక్ట్ వంటి బాలల రక్షణ చట్టాల ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు తమ కెరీర్ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని, క్రమ శిక్షణతో కష్టపడి చదవడం ద్వారా విజయాన్ని సాధించాలని అన్నారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలని, చట్టాలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని తెలిపారు. అనంతరం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కె.లలితకుమారి మాట్లాడుతూ.. ప్రతి బాలిక తనలోని శక్తిని గుర్తించి ధైర్యంగా ముందుకు సాగాలని, మహిళలు ప్రపంచంలో తమ భావోద్వేగ సమతుల్యతతో సమాజానికి శక్తి నిలవాలని, ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని నిర్ణయించుకొని విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి భవిష్యత్తులో సమగ్ర అభివృద్ధి సాధించాలని తెలిపారు. ఈ సంవత్సరం థీమ్‌ ప్రకారం బాలికల హక్కులపై పెట్టుబడి పెట్టడం అంటే భవిష్యత్తు సమాజ అభివృద్ధిలో పెట్టుబడి పెట్టినట్టే అని పేర్కొన్నారు. విద్య అనేది ఒక అమ్మాయినీ మాత్రమే కాదు ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని వెలిగించే శక్తి అని సూచించారు. కార్యక్రమంలో ఆడపిల్లల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మొక్కలు నాటడం, “నషా ముక్త భారత్ అభియాన్” పోస్టర్లను విడుదల చేశారు. అలాగే ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు ప్రదానం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ అంజమ్మ, ఝరాసంగం ఎస్‌ఐ క్రాంతి కుమార్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ నిర్మల, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, స్కూల్ సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment