కార్తీక వన భోజనాలకు మంత్రి, ఎంపీలకు ఆహ్వానం

సంగారెడ్డి, అక్టోబర్ 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నవంబర్ 2న కార్తీక వన భోజనాలను ఘనంగా నిర్వహించనున్నట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు. మంజీరా బ్యారేజ్ సమీపంలోని శ్రీ గంగా సమేత ఆలయంలో ఈ వన భోజనాలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఆధ్యాత్మికత, ఐక్యత, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే విధంగా ఈ వనభోజనాలు నిర్వహించడం ఆనవాయితీగా మారిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్ పాటిల్, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్, మాజీ ఎంపీ బీబీ పాటిల్ ను ఆహ్వానించారు. కార్యక్రమ విజయవంతం కోసం సంఘ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ చైర్మన్, రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు పట్లోళ్ల సంగమేశ్వర్, సంగారెడ్డి రాష్ట్ర కార్యదర్శులు పరమేశ్వర్, మహేష్, జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షుడు ధనంజయ, అధ్యక్షుడు పృథ్వీరాజ్, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, కోశాధికారి గోవురాజు, ఉప కోశాధికారి శివకుమార్, ఉపాధ్యక్షులు రాజేశ్వర స్వామి, సంగీశెట్టి, కార్యదర్శులు చంద్రశేఖర్, శివకుమార్, గౌలీశ్వర్, జగదీశ్వర్, శెట్టి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment