ఈ నెల 11 నుండి ఇర్ఫాని దర్గా ఉర్సు ఉత్సవాలు

సంగారెడ్డి, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): రెండు రోజుల పాటు జరగబోయే ఉర్సు ఉత్సవాలు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ, హిందూ-ముస్లిం సోదరభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని పీఠాధిపతి హజ్రత్ హకీమ్ ఒమర్ బిన్ అహ్మద్ సజ్జద్ యే నషీన్ బార్గ ఇర్ఫానీ అన్నారు. సంగారెడ్డి పట్టణ శివారులోని హజ్రత్ మౌలానా అల్ హజ్ హాబీబ్ అహ్మద్ బిన్ ఒమర్ అల్ మారూఫ్ హాబీబ్ ఇర్ఫాన్ అలీ షా బంద నవాజి (ఇర్ఫాని దర్గా) 23వ ఉర్సు ఉత్సవాలు ఈ నెల 11నుండి రెండు రోజుల పాటు జరుగనున్నాయని పీఠాధిపతి హజ్రత్ హకీమ్ ఒమర్ బిన్ అహ్మద్ సజ్జద్ యే నషీన్ బార్గ ఇర్ఫానీ తెలిపారు. ప్రతి ఏడాది రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. మొదటి రోజైన 11వ తేదీ శనివారం సంగారెడ్డిలోని జామా మస్జిద్ నుండి సాయంత్రం 5 గంటలకు గంధం ఊరేగింపు, రాత్రి 8గంటలకు ఇర్ఫాని దర్గాలో గంధారాధన, 9 గంటలకు ఆల్ ఇండియా ముషాయిరా ఉంటుందని తెలిపారు. ఈ ముషాయిరా కార్యక్రమంలో ప్రముఖ కవులు ఫారూఖ్ రజా శేగావ్, నయిమ్ ఫరాజ్ అకోలా, మీసం గోపాల్ పూరి బీహార్, అత్యబ్ ఏజాజ్ హైదరాబాదీ , సుందర్ మాలేగాని మహారాష్ట్ర, ఇర్షాద్ అంజుమ్ మాలేగావ్, అజీమ్ షాద్ రాయ్ పూరి, సాబేర్ బసుమతి మహారాష్ట్ర, మనోవర్ షా జింటూర్, డాక్టర్ రజీ షుత్తరీ నిజాంబాద్, షకీల్ జహీరాబాదీ పాల్గొంటారని తెలిపారు.రెండవ రోజు 12వ తేదీ ఆదివారం సాయంత్రం దీపారాధన, ఖవ్వాలి కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు భోజన ఏర్పాటు చేశామని అన్నారు. ఉత్సవాలలో వివిధ దర్గాల పీఠాధిపతులు , స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, మత పెద్దలు హాజరు కానున్నారని తెలిపారు. అదేవిధంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను సన్మానించి, ఇర్ఫానీ అవార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా విచ్చేసే మహిళా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశామన్నారు, ఉత్సవాల కోసం ఇర్ఫాని దర్గాను ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ అదేవిధంగా ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు అన్ని మౌలిక సదుపాయాలతో పాటు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా విశాలమైన పార్కింగ్, విద్యుత్, భద్రత, శుభ్రత వంటి సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని పీఠాధిపతి అన్నారు. ఈసారి ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహిస్తున్నట్లు అదేవిధంగా విచ్చేసే భక్తులకు సేవలు అందించేందుకు ఇర్ఫానీ దర్గా వాలంటీర్స్ అనునిత్యం అందుబాటులో ఉంటారని తెలిపారు. భక్తులు ఉత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఇర్ఫానీ దర్గా పీఠాధిపతి హజ్రత్ హకీమ్ ఒమర్ బిన్ అహ్మద్ సజ్జద్ యే నషీన్ బార్గ ఇర్ఫానీ కోరారు. ఈ కార్యక్రమంలో అల్ హజ్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ పైసల్, మహమ్మద్ ఖాలీఖ్ హుస్సేనీ, అహ్మద్ బిన్ ఉమర్ ఇర్ఫానీ, నోమాన్ బిన్ ఉమర్ ఇర్ఫానీ, ఆర్గనైజింగ్ ఇంచార్జ్ దర్గా కమిటీ షేక్ షకీల్ అహ్మద్ ఇర్ఫానీ, షబ్బీర్ అహ్మద్ హష్మీ, సయీద్ బిన్ సాలెహ్, మహమ్మద్ బిన్ యహియ ఇర్ఫానీ, సలీమ్ ఖాన్, మీర్ అసద్ అలీ ఇర్ఫానీ, అతర్ గౌస్వి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment