ప్రజలకు ఎన్నికల దృష్ట్యా పారదర్శకమైన వాతావరణాన్ని కల్పించే బాధ్యత పోలీసులదే 

ప్రజలకు ఎన్నికల దృష్ట్యా పారదర్శకమైన వాతావరణాన్ని కల్పించే బాధ్యత పోలీసులదే

 

— జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

 

ప్రశ్న ఆయుధం

 

కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ నవంబర్ 27

 

గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పారదర్శకమైన బాధ్యత పోలీసుల దేనని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పోలీస్ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచారెడ్డి గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన నామినేషన్ పోలింగ్ కేంద్రాన్ని, అలాగే రామారెడ్డి మండలంలోని రామారెడ్డి, పోసానిపేట్ గ్రామపంచాయతీలను గురువారం రోజున ఆకస్మికంగా పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా నామినేషన్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో ఎస్పీ ప్రత్యేకంగా మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ ప్రక్రియను పూర్తిగా నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించాలని పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంచిత పరిస్థితులు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు పారదర్శకమైన వాతావరణ కల్పించి, శాంతిభద్రతలను కాపాడడంలో ఎలాంటి రాజీ లేకుండా ఉండాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియను ఎవరైనా భంగపరచాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే జిల్లాలోని అన్ని గ్రామాలపై ప్రత్యేక నిఘ ఏర్పాటు చేసి, ప్రతి పోలింగ్ కేంద్రంలో పగడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తూ, పెట్రోలింగ్, క్విక్ రెస్పాన్స్ టీం లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుందని ఎవరైనా అక్రమ డబ్బు, మద్యం పంపిణీ చేసిన, బెదిరింపుల గురిచేసిన, అనైతిక ప్రలోభాలు, తప్పిదాలు జరిగినట్టు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఆకస్మిక పరిశీలనలో జిల్లా ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, సంబంధిత ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment