సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): కొండాపూర్ మండలం మల్కాపూర్ లోని ఓ గార్డెన్‌లో సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. 2017లో జరిగిన రాహుల్ గాంధీ సభ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు పార్టీకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఓ సీనియర్ నాయకుడి భూమిని అమ్మించి సభ ఏర్పాట్లు చేశామని, తన మనసులోని బాధను పంచుకున్నారు. జగ్గారెడ్డిని ఓదార్చేందుకు పలువురు నాయకులు, కార్యకర్తలు ముందుకు వచ్చారు.