సంగారెడ్డి, ఆగస్టు 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): టీపీసీసీ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల కూతురు జయరెడ్డి వివాహం సందర్భంగా 1.25 లక్షల రూపాయల పట్టు చీరను కాంగ్రెస్ యువ నాయకుడు పోలీస్ కృష్ణ బహుకరించారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని తమ స్వగృహంలో నిర్వహించిన పెళ్లి కూతురు చేసే కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కృష్ణ పట్టు చీరను బహుకరించి నిర్మల జగ్గారెడ్డిల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తనను అన్ని విధాలుగా వెన్నుతట్టి ప్రోత్సహించి, ఇబ్బందుల్లో సహాయ సహకారాలు అందించిన నాయకుడు జగ్గారెడ్డి అని తెలిపారు. దేశ రాజకీయాల్లో జగ్గారెడ్డికి ప్రజల్లో ప్రత్యేక అభిమానం ఉందని, ఎంతో మందినీ ఇబ్బందుల్లో ఆదుకున్న మంచి మనసున్న మనిషి జగ్గారెడ్డి అని తెలిపారు. జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని మనస్పూర్తిగా కోరుతున్నట్లు పోలీస్ కృష్ణ ఆకాంక్షించారు.
జగ్గారెడ్డి కుమార్తెకు 1.25 లక్షల పట్టు చీర బహుకరించిన పోలీస్ కృష్ణ
Published On: August 6, 2025 3:57 pm