సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి, గుణ చైతన్యరెడ్డిల వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. గురువారం రాత్రి సంగారెడ్డి రాంనగర్‌లోని శ్రీ రామ మందిరం వద్ద జయారెడ్డి, గుణ చైతన్య రెడ్డిల వివాహం వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు, పార్టీ నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.