Site icon PRASHNA AYUDHAM

కామారెడ్డికి కాళేశ్వరం నీళ్లు చుక్కైనా రాలేదు

IMG 20251128 WA0033

కామారెడ్డికి కాళేశ్వరం నీళ్లు చుక్కైనా రాలేదు

ప్యాకేజీ–22 కోసం 1,446 కోట్లు కావాలి… ఇప్పటివరకు 450 కోట్లు మాత్రమే విడుదల

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 28

కామారెడ్డి: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి, నిజామాబాద్, దుబ్బాక, భాన్సువాడలకు నీళ్లు అందించేందుకు ప్యాకేజీ–22 పనులు ప్రారంభించినప్పటికీ, ప్రాజెక్టు పురోగతి చాలా మందగమైందని ఆమె విమర్శించారు.  ప్యాకేజీ–22 పనులకు మొత్తం రూ.1,446 కోట్లు అవసరమని, కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం రూ.450 కోట్లు మాత్రమే విడుదల చేసిందని తెలిపారు. అంతేకాకుండా ప్రాజెక్టు నిర్మాణానికి కావలసిన 1,500 ఎకరాల భూమిలో సగం కూడా ఇంకా సేకరించలేదని పేర్కొన్నారు. కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నప్పటికీ, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా నీరు రాలేదని తీవ్రంగా విమర్శించారు. అదే విధంగా నిజామాబాద్ జిల్లాకూ నీరు అందలేదని తెలిపారు. ఒక్కసారి హల్దీవాగు నుండి నీటిని మళ్లించి నిజాంసాగర్ నింపిన తరువాత నాలుగేళ్లు వరుసగా పుష్కల వర్షాలు కురవడంతో ఆ అవసరం కూడా లేకుండా పోయిందని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని తాము పలుమార్లు చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తుచేశారు.

Exit mobile version