సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబరు 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆత్మీయ పలకరింపులు, అన్యోన్యత భావంతో నాటి మాటల స్మృతులను నేడు గుర్తు చేసుకోవడంతో పాటు 27 సంవత్సరాల తర్వాత నాటి మిత్రులు, ఉపాధ్యాయులతో కలిసి 10వ తరగతి (1996-1997) పూర్వ విద్యార్థులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగింది. కంది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత 27 సంవత్సరాల క్రితం పూర్తి చేసుకున్న పదవ తరగతి విద్యార్థులు నేడు మళ్లీ కలిసి నాటి మధురస్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కాశీనాథ్, మన్నె మల్లేష్, విజయ్ కుమార్, శ్రీనివాస్, రమేష్, సుధాకర్ రెడ్డి, బి.రాధ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నాటి ఉపాధ్యాయులు తమ విద్యార్థులతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులందరూ కలిసి ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులు మేము విద్య చెప్పిన విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో కలిసి మంచి స్థాయిలో ఉన్నందుకు గాను మేము గర్వ పడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు శ్రీనివాస్, పాండు, గౌస్, ఎల్లమ్మ ,లింగం, గణేష్. మొయినొద్దిన్, జైనుల్లా తదితరులు పాల్గొన్నారు.
కంది పాఠశాలలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Published On: October 21, 2024 6:50 pm