మహా పాదయాత్రలో పాల్గొన్న కాట శ్రీనివాస్ గౌడ్

సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): శ్రావణ మాసం పురస్కరించుకొని, పటాన్‌చెరు పట్టణంలోని జెపి కాలనీ శ్రీ ఉమామహేశ్వర దేవాలయం నుండి బొంతపల్లి శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం వరకు వీరశైవ లింగాయత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 18వ మహా పాదయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో భాగంగా పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ వద్ద పాదయాత్ర బృందాన్ని ఆత్మీయంగా కలిసి, పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పాదయాత్రలో పాల్గొన్నారు. భక్తి, ఆధ్యాత్మికత మరియు సమాజ సేవకు మార్గదర్శకంగా నిలిచే ఈ పాదయాత్రలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment