సంగారెడ్డి/పటాన్చెరు, డిసెంబర్ 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్చెరు మండలం నందిగామ గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన విక్రమ్ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధాశ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ విక్రమ్ గౌడ్ తో పాటు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాట సుధాశ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ మరియు వార్డు సభ్యులు సమిష్టిగా పని చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని బాధ్యతాయుత పాలన అందించాలని కోరారు. గ్రామాభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న కాట సుధా శ్రీనివాస్ గౌడ్
Published On: December 22, 2025 7:46 pm