టి పి సి సి ఉపాధ్యక్షుడు బండి రమేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన
కిక్ బాక్సర్ ప్రతిభ తక్కడపల్లి
ప్రశ్న ఆయుధం జులై16: కూకట్‌పల్లి ప్రతినిధి
ప్రముఖ కిక్ బాక్సర్ ప్రతిభ తక్కడపల్లి బుధవారం టి పి సి సి ఉపాధ్యక్షుడు జహీరాబాద్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ని మూసాపేటలోని హేమదుర్గ భవన్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. థాయ్ బాక్సింగ్, చెస్ బాక్సింగ్, టైక్వాండో, కిక్ బాక్సింగ్, ఉషూ, ఎం ఎం ఏ గ్రాఫ్లింగ్ వంటి స్పోర్ట్స్ లో అంతర్జాతీయ బంగారు పతకాలు సాధించారు. సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో సెర్బియాలో జరగనున్న చెస్ బాక్సింగ్ లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ స్పోర్ట్స్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.
టి పి సి సి ఉపాధ్యక్షుడు బండి రమేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కిక్ బాక్సర్ ప్రతిభ తక్కడపల్లి
by Madda Anil
Published On: July 16, 2025 7:38 pm