సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలను పురస్కరించుకుని సంగారెడ్డి ఎఫ్ఆర్ఎస్ వద్ద గల శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మాధురి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాధురి మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమంలో, ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన మూడు దశల ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రజా సేవ తపనతో కొనసాగుతూ సమాజంలోని పౌరుల హక్కులను రక్షించడానికి న్యాయ విద్యను లోతుగా అభ్యసించిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.అంజయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జగదీష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రభుగౌడ్, సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొప్పెరి వెంకట హరి హర కిషన్, గౌరవ అధ్యక్షుడు గొంట్యాల పండరి, వర్కింగ్ ప్రెసిడెంట్ నక్క రాఘవులు, ప్రధాన కార్యదర్శి తాటికొండ అశోక్, కోశాధికారి పోల పుండరీకం, ముఖ్య సలహాదారు యాగ్ని మురళి, కార్యదర్శి సోమ రమేష్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు పి.మల్లికార్జున్ పాటిల్, సంఘం యవత అధ్యక్షుడు గోరుగంటి రమేష్ కుమార్, సంగారెడ్డి జిల్లా సంఘం ప్రదాన కార్యదర్శి యస్.రాజేశ్వర్ స్వామి, వీరశైవ లింగయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కొంక రాజేశ్వర్, యువజన సంఘాల అధ్యక్షుడు కూన వేణు, వివిధ పద్మశాలి సంఘం నాయకులు, జిల్లా మహిళా అధ్యక్షురాలు గంజి మంజులత, మహిళా ఉపాధ్యక్షురాలు సుదం నిర్మల, సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు గజేంద్రుల కృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి కలివేముల సత్యనారాయణ, పట్టణ కోశాధికారి ఇమ్మడి శ్రీనివాస్, పద్మశాలి సంఘం టౌన్ ప్రసిడెంట్ తాటి భగవన్ దాసి, వర్కింగ్ ప్రసిడెంట్ డాక్టర్ మార్కండేయ, జిల్లా జనరల్ సెక్రేటరీ యం. విశ్వనాధం, జిల్లా ట్రెజరర్ యన్. ప్రబాకర్, రాష్ట్ర యుత్ ప్రసిడెంట్ రాజు గందమల్ల, టౌన్ యూత్ ప్రసిడెంచ్ శ్రీరామ్ వెంకట్, టౌన్ యుత్ జనరల్ సెక్రటరీ డి. నాగరాజు, పద్మశాలి నాయకులు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
Updated On: September 27, 2025 5:15 pm