నర్సాపూర్ లో బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు

నర్సాపూర్, సెప్టెంబర్ 27 (ప్రశ్న ఆయుధం న్యూస్) కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నర్సాపూర్ డివిజన్ బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ డివిజన్ బీసీ ఉద్యోగ సంఘం ప్రెసిడెంట్ కె.శేషచారి మాట్లాడుతూ.. స్వాతంత్ర ఉద్యమం కోసం, నిజాం నియంత పరిపాలన వ్యతిరేక ఉద్యమం, తొలి తెలంగాణ ఉద్యమంలో, ఎమ్మెల్యే పదవిని వదిలి ఉద్యమంలో పాల్గొన్న మహా నేత, మలిదశ తెలంగాణ ఉద్యమంలో, ఉద్యమ కారులందరికీ స్ఫూర్తినిచ్చిన గొప్ప నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలిపారు. ఆయన స్ఫూర్తితో నర్సాపూర్ డివిజన్ లో బీసీ ఉద్యోగ భవనం నిర్మాణం కోసం, బీసీ సంక్షేమ భవనం నిర్మాణం కోసం కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా బీసీ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ అమలు చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగ సంఘం నాయకులు దొంతి ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, వెంకటకృష్ణ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now