అందరి సహకారంతో కొండ పోచమ్మ ఆలయ అభివృద్ధికి కృషి: కొండపోచమ్మ ఆలయ చైర్మన్ అను గీత

మెదక్/గజ్వేల్, జూలై 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): అందరి సహకారంతో కొండ పోచమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని కొండ పోచమ్మ ఆలయ చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన అను గీత అన్నారు. చైర్మన్‌తో పాటు పాలకమండలి టి. వెంకట్రాంరెడ్డి, మసపాక అనసూయ, కిషన్, రాజు, జనార్దన్ రెడ్డి, గుండు లక్ష్మణ్, గడ్డం రాజు, పోకల నరసింహులు, చిట్టి దేవేందర్ రెడ్డి సభ్యులతో సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఆలయ ఈవో రవి కుమార్ లు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. కొండ పోచమ్మ అమ్మవారి సేవ కొరకు తనకు అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నాయకుల కార్యకర్తల భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి చేసుకునేలా ప్రణాళికలు వేసుకుందామని అన్నారు. ప్రభుత్వ నిధుల నుండి ఆలయానికి కావలసిన అన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామన్నారు. కప్పర రాంప్రసాదరావు , కప్పర ప్రసాదరావు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ఒడి బియ్యం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ తూముకుంట నర్సారెడ్డి, గజ్వేల్ మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ మోహన్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు బండారు శ్రీకాంత్ రావు, తిగుల్ నర్సాపూర్ తాజా మాజీ సర్పంచ్ రమేష్, మండల అధ్యక్షుడు పీర్లపల్లి రవీందర్ రెడ్డి, తిగుల్ తాజా మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రసాద్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సోక్కం సురేష్, మల్లికార్జున్ రెడ్డి, కన్నయ్య యాదవ్, గాడిపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now