సంగారెడ్డి, అక్టోబర్ 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం అని రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షుడు కూన వేణు అన్నారు. శనివారం సంగారెడ్డిలో సీనియర్ జర్నలిస్ట్ షేక్ మహబూబ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర యువజన సంఘాల నాయకుడు కూన వేణుగోపాల్, జోగిపేట మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు అతిథులుగా హాజరయ్యారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ.. జర్నలిస్టులు సమాజంలో కీలక పాత్ర పోషిస్తారని, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వారధిలా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. నేటి వేగవంతమైన ప్రపంచంలో పత్రికా ప్రతినిధులు నిబద్ధతతో పని చేస్తూ ప్రజా ప్రయోజనాలను కాపాడే కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారని అన్నారు. అనంతరం చిట్టిబాబు మాట్లాడుతూ.. జర్నలిజం ఒక పవిత్రమైన వృత్తి అని, నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులు సమాజ అభివృద్ధికి మార్గదర్శకులుగా నిలుస్తారని చెప్పారు. ప్రభుత్వం జర్నలిస్టులకు నెల నెల తగిన పారితోషికం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక జర్నలిస్టులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం: రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షుడు కూన వేణు
Updated On: October 25, 2025 8:11 pm