సంగారెడ్డి మురళీకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు

సంగారెడ్డి, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్):సంగారెడ్డి పట్టణంలోని మురళీకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ వేడుకల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల మధ్య ఐక్యత పెంచడానికి పండుగలు దోహదపడతాయని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, మాజీ కౌన్సిలర్ రామప్ప, విఠల్ రెడ్డి, లాడే మల్లేశం, కొత్తపల్లి శ్రీకాంత్, మోహన్ సింగ్, శ్రవణ్ రెడ్డి, జలంధర్, గొల్ల ఆంజనేయులు, అక్బర్, అఖిల్ ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment