వరుస దొంగతనాలతో  లబోదిబోమన్న బాధితులు

మహిళను ఏమార్చి కారులో నుంచి డబ్బులు లూటీ

వరుస దొంగతనాలతో

లబోదిబోమన్న బాధితులు

–వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పట్టపగలు ఘటన

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం కారులో ఉన్న మహిళను మైమరిపించి ఓ కేటుగాటు డబ్బులు లూటీ చేశాడు. అమ్మ వైద్య ఖర్చుల కోసం బంగారం తాకట్టు పెట్టి తీసుకవచ్చిన డబ్బులు క్షణాల్లో మాయం కావడంపై బాధితులు లబోదిబో మన్నారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పేట్ మండలం బురాన్ పూర్ తాండాకు చెందిన రాజు, శారదలు దంపతులు. శారద తల్లి అనారోగ్యానికి గురికావడంతో ఆమె వైద్య ఖర్చుల కోసం బంగారం తాకట్టు పెట్టేందుకు బుధవారం వారిద్దరు పాపతో కలిసి తాండూరు పట్టణానికి వచ్చారు. పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో వారికి సంబంధించిన బంగారం తాకట్టు పెట్టి రూ. 1లక్ష 30వేలు తీసుకోగా లోన్ ఖర్చులు పోను రూ. 1 లక్ష 29 వేలు చేతికి అందాయి. అనంతరం సాయంత్రానికి ముందు పట్టణంలోని మెట్రో హొ టల్లో భోజనం చేసి వచ్చారు. మళ్లీ కారులో బయల్దేరారు. కొద్ది దూరం హెచ్ బీ కాంప్లెక్స్ వద్దకు రాగానే ఓ గుర్తుతెలియని వ్యక్తి వారి కారు టైరు పంశ్చర్ అయ్యిందని తెలిపాడు.

దీంతో భర్త రాజు కారు టైరును విడదీసి భార్య శారద, పాపను కారులోనే ఉంచి పంశ్చర్ చేయించేందుకు వెళ్లాడు. అక్కడే ఉన్న కేటుగాడు కారులో ఉన్న శారదను కారుకు టైరు లేకపోవడంతో అది కిందపడుతుందని, బయటకు రావాలని ఆమెను ఏమార్చాడు. దీంతో శారద పాపతో కలిసి కిందకు దిగే క్రమంలోనే కేటుగాడు కారులో ఉన్న క్యాష్ బ్యాగ్ తో ఉడాయించాడు. క్షణాల్లోనే తేరుకుని డబ్బుల బస్తాను పరిశీలించగా కనిపించలేదు. వెంటనే శారద భర్త రాజుకు విషయాన్ని తెలిపింది. రాజు కారు వద్దకు చేరుకుని పరిశీలించగా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. వెంటనే తాండూరు పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తల్లి వైద్యం కోసం తెచ్చిన డబ్బు దొంగ ఎత్తుకెళ్లడంతో దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.

వరుస దొంగతనాలతో గత నెల రోజుల వ్యవధిలో తాండూరు పట్టణంలో ఒకే రోజు రెండు ఇళ్లలో సాయిపూర్ లో 40 తులాల బంగారం మరో ఇంట్లో 17 తులాల బంగారంతో పాటు 5 లక్షల రూపాయల నగదును చోరీ చేసిన సంగతి మరవక ముందే నేడు పట్టపగలు ప్రధాన రహదారిపై మరో దొంగతనం జరగడంతో తాండూర్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment