గొప్ప కామ్రేడ్ కు లాల్ సలాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు 

గొప్ప కామ్రేడ్ కు లాల్ సలాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు 

విద్యార్థి దశ నుంచి చివరి శ్వాస వరకు విలువలకు కట్టుబడి జీవించిన మహనీయుడు గొప్ప కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి కి లాల్ సలాం. శోకతప్త హృదయంతో వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నుంచి సిపిఐ జాతీయ కార్యదర్శిగా మూడు మార్లు పనిచేయడం అంటే ఎంతో నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదల ఉంటేనే అవి సాధ్యం. సుధాకర్ రెడ్డి చిన్ననాటి నుంచే ప్రజల జీవన స్థితిగతుల్లో మార్పు రావాలని, సిపిఐ లో కీలక నేతగా ఉన్నప్పటికీ అధికార పక్ష నేతలతో సంప్రదింపులు చేసి ప్రజల కోసం పనిచేసేవారిని గుర్తు చేశారు. 2004లో విద్యుత్ పోరాటంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆయన చేసిన పోరాటం మరువలేనిది అన్నారు. విద్యుత్ పోరాటం తదుపరి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో సురవరం సుధాకర్ రెడ్డి  ఆలోచనలు ఉన్నాయి. వారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు పరుష పదజాలం వాడడం, పక్క వ్యక్తులను శత్రుభావంతో చూడడం జరగలేదు. వారిని నేను అత్యంత అభిమానం నాయకుడిగా చూస్తాను. వారికి గొప్ప గౌరవం ఇవ్వాలని ఆలోచనతోనే అంతిమ సంస్కారాలు అధికారికంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి తో పాటు యావత్ క్యాబినెట్ నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు క్యాబినెట్ సహచరులు అంతా మగ్డూమ్ భవన్ కు వచ్చి ఘనంగా నివాళులు అర్పించారు. సురవరం సుధాకర్ రెడ్డి  కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండదండగా నిలుస్తుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment