సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, జనవరి 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లాలో పిల్లల పోషకాహారం, ఆరోగ్య స్థితి మెరుగుపర్చే లక్ష్యంతో సూపర్‌వైజ్డ్ సప్లిమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రామ్‌ను ప్రత్యేకంగా అమలు చేయడానికి ఐసీడీఎస్ (ICDS), ఆరోగ్య శాఖలు సమన్వయంతో కార్యచరణ రూపొందించుకున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం యునిసెఫ్ న్యూట్రిషన్ కన్సలెంట్ లు ఖ్యాతీ, జన్యలు సంగారెడ్డి జిల్లాను సందర్శించి, అమలు విధానాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా పిల్లల పెరుగుదల అంచనా, ఆరోగ్య పరీక్షలు, అవసరమైన మందుల పంపిణీ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు. పిల్లల్లో పోషక లోపాలను తొలగించేందుకు శాఖల సమన్వయం అత్యంత అవసరమని, ఈ కార్యక్రమం ద్వారా పిల్లల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ సాధ్యమవుతుందని లలిత కుమారి వివరించారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ అడిషనల్ పీడీ సూర్యారావు, సీడీపీఓ చంద్రకళతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పిల్లల పోషకాహారంపై నిరంతర పర్యవేక్షణే మా లక్ష్యం: మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి
Published On: January 6, 2026 8:48 pm