- మృతుని కుటుంబానికి లక్ష్మీ ఫౌండేషన్ ఆర్థిక చేయుత
- లక్ష్మీ ఫౌండేషన్ చైర్మన్, 3వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ మర్కంటి వరలక్ష్మి కనకయ్య ముదిరాజ్
గజ్వేల్, 09 ఫిబ్రవరి 2025 :
మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ 4వ వార్డు కు చెందిన నర్సి చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీ ఫౌండేషన్ చైర్మన్, 3వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ మర్కంటి వరలక్ష్మి కనకయ్య ముదిరాజ్ వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 16వ వార్డు బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాకని బిక్షపతి, 4వ వార్డు అధ్యక్షులు ఎక్కల దేవి కనకరాజు యాదవ్, 3వ వార్డు అధ్యక్షులు శ్రీరామ్ మల్లేశం, గజ్వేల్ సాయిలు, తదితరులు పాల్గొన్నారు.