బీసీల రిజర్వేషన్ తీర్పు విచారకరం: బీసీ సంక్షేమ సంఘం నాయకులు

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): బీసీల రిజర్వేషన్ తీర్పు విచారకరం అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రభు గౌడ్ అన్నారు. కోర్టు తీర్పు బీసీలకు వ్యతిరేకంగా వచ్చినందున శుక్రవారం సంగారెడ్డి వై ఎస్ ఆర్ భవన్‌లో జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రభు గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన జీవో 9ను కోర్టు కొట్టివేయడం ఎంతో బాధాకరమని తెలిపారు. మొత్తం జనాభాలో బీసీలు 56 శాతం ఉన్నా, ప్రభుత్వం ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లను కూడా అగ్రవర్ణాలు కోర్టులో పిటిషన్ వేసి రద్దు చేయించడం అన్యాయం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గోకుల్ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున పాటిల్, ముఖ్య సలహాదారులు చంద్రయ్య స్వామి, కార్యనిర్వాహక అధ్యక్షురాలు నాగరాణి, కార్యదర్శులు సుధాకర్ గౌడ్, సంగమేశ్వర్, అధికార ప్రతినిధి మంగ గౌడ్, కార్మిక విభాగం అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మంజులా గౌడ్, ప్రధాన కార్యదర్శి వీరమణి, ఉపాధ్యక్షుడు లత, కార్యదర్శులు మానస, సరిత, సదాశివపేట మండల అధ్యక్షుడు కుమ్మరి గోపాల్, మండల అధ్యక్షుడు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment