కలెక్టర్ వల్లూరు క్రాంతికి వినతి పత్రం అందజేసిన ముదిరాజ్ నాయకులు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని ముదిరాజులను బీసీ డి నుండి ఏలో మార్చాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి నాయకులు వినతి పత్రం అందజేశారు. సోమవారం జిల్లా కార్యాలయంలో కలెక్టర్ వల్లూరు క్రాంతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షుడు పట్నం మాణిక్యం మాట్లాడుతూ.. ముదిరాజులు అనేక సంవత్సరాలుగా అనేక రంగాలలో వెనుకబడి ఉన్నారని, ప్రభుత్వం వెంటనే మార్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు సఫాన్ దేవ్, ఏటన్న తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now