జిల్లా కలెక్టర్ ను కలిసిన గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ను గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు కలిశారు. జీహెచ్ఎంసీ పరిధిలోకి సంగారెడ్డి జిల్లాలోని కొన్ని గ్రామాలను కలిపిన సందర్భంగా, ఆయా గ్రామాలలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 24శాతం ఇంటి అద్దె భత్యం చెల్లించాలని, అందుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్య ను కలిసి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు కలెక్టర్ ప్రావీణ్యకి పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్.డి.వైద్యనాథ్, డాక్టర్.ఎస్.సంతోష్ కుమార్, సంఘ నాయకులు వినయ్ కుమార్, కోలా రవికుమార్, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment