సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): హైదరాబాదులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే బహిరంగ సభకు గుమ్మడిదల మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. శుక్రవారం అన్నారం వద్ద చేరుకున్న నాయకులు సభకు వాహనాల ద్వారా ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పుట్టా నర్సింగ్ రావు, బొంతపల్లి ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, నాయకులు నాగేందర్ గౌడ్, మద్ది వీరా రెడ్డి, గోవర్ధన్ గౌడ్, నరేందర్ రెడ్డి, తులసి దాస్, జయశంకర్ గౌడ్, జంగారెడ్డి, కుమార్ గౌడ్, లక్ష్మీనారాయణ, నరేందర్ రెడ్డి, విజయ్ కుమార్, మహిపాల్ రెడ్డి, వీరేశం తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ సభకు తరలివెళ్లిన గుమ్మడిదల మండల నాయకులు
Published On: July 4, 2025 9:00 pm
