రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలిసిన టీఎన్జీవోస్ నాయకులు

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, జనవరి 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను టీఎన్జీవోస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ ఆధ్వర్యంలో జిల్లా టీఎన్జీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు, ఉద్యోగ భద్రత వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఎస్సీ–ఎస్టీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ కమిషన్ మరింత చురుకుగా వ్యవహరించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన చైర్మన్ బక్కి వెంకటయ్య ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భేటీలో సంగారెడ్డి జిల్లా టీఎన్జీఎస్ కార్యదర్శి వేల్పూరు రవి, అసోసియేట్ అధ్యక్షుడు కసిని శ్రీకాంత్, కోశాధికారి శ్రీనివాస్, రాష్ట్ర పంచాయతీ సెక్రెటరీల అధ్యక్షులు బలరాం, వెంకట్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశం, యాదవ రెడ్డి, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment