సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీ పరితోష్ పంకజ్ ను బీసీ రాష్ట్ర, జిల్లా వెనుకబడిన తరగతులు సంక్షేమ సంఘం నాయకులు కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం సంగారెడ్డి పోలీసు కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్ ను శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం కార్య నిర్వహక అధ్యక్షుడు ప్రభుగౌడ్, రాష్ట్ర సంఘ నాయకులు కృష్ణయ్య, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, కరణ్ జిత్ సింగ్, వినయ్ తదితరులు ఉన్నారు.
ఎస్పీ పరితోష్ పంకజ్ ను సన్మానించిన నాయకులు
Published On: March 13, 2025 5:54 pm
