సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యువ, సీనియర్ నాయకులు దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ దశమితో అందరి దశ మారాలని, సమాజంలో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని దుర్గామాతను కోరినట్లు తెలిపారు.
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు దసరా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
Published On: October 17, 2024 6:14 pm
