మాచారెడ్డి, రామారెడ్డి పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ
ప్రశ్న ఆయుధం కామారెడ్డి

జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర, గురువారం మాచారెడ్డి, రామారెడ్డి పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ల పరిసరాలను పరిశీలించి, స్టేషన్‌లో ఉన్న రికార్డులను పరిశీలించి, పోలీస్ స్టేషన్ పనితీరును తెలుసుకొని, పోలీస్ స్టేషన్ల సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకుని, స్టేషన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామ పోలీసు అధికారుల విలేజ్ పోలీస్ ఆఫీసర్ కు కేటాయించబడిన గ్రామాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తులో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలిపి అదేవిధంగా విజిబుల్ పోలీసింగ్ ఉండాలని, సిబ్బంది అధికారులు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని, సిబ్బంది అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణలో కృషి చేయాలని అన్నారు.
హిస్టరీ షీటర్స్, సస్పెక్ట్స్ మరియు పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, నైట్ బీట్, పెట్రోల్లింగ్ అధికారులు విధి నిర్వాహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
సిబ్బంది వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పి సూచించారు.
Post Views: 21