*మండల స్థాయి ఎస్ జి ఎఫ్ క్రీడోత్సవాలు*
జమ్మికుంట /ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 26
ఈనెల (ఆగస్ట్) 29, 30 తేదీలలో మండల స్థాయి ఎస్ జి ఎఫ్ క్రీడోత్సవాలు నిర్వహించబడతాయని మండల విద్యాధికారి కే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు అండర్ 14 అండర్ 17 విభాగాల్లో బాలికలకు బాలులకు వేరువేరు విభాగాల్లో క్రీడోత్సవాల నిర్వహించబడతాయని 29 రోజున బాలురకు అండర్ 14 అండర్ 17 విభాగాలలో కబడ్డీ కోకో వాలీబాల్ పోటీలు నిర్వహించబడతాయని 30 తారీఖున బాలికలకు అండర్14 అండర్ 17 విభాగాలలో కబడ్డీ కోకో వాలీబాల్ పోటీలు నిర్వహించబడతాయని ఇట్టి పోటీలలో పాల్గొను అండర్ 14 బాల బాలికలు 1 జనవరి 2011 తర్వాత జన్మించి ఉండాలని అండర్ 17 విభాగంలో 1 జనవరి 2008 తర్వాత జన్మించి ఉండాలని క్రీడాకారులందరూ విధిగా పాఠశాల హెడ్మాస్టర్ చే డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు సర్టిఫికెట్ తెచ్చుకోవాలని కబడ్డీ క్రీడకు బరువులు అండర్ 14 బాలికలకు 48 కేజీ అండర్ 14 బాలురులకు 51 కేజీ అండర్ 17 బాల బాలికలకు 55 కిలోలు ఉండాలని ఈ క్రీడోత్సవాలలో ప్రభుత్వ ప్రైవేటు మోడల్ స్కూల్ కేజీబీవీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా పాల్గొనవచ్చని తెలిపారు క్రీడా పోటీలు ఇల్లందకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించబడునని ఎంఈఓ కే .శ్రీనివాస్ రెడ్డి తెలిపారు పోటీల నిర్వహణకు మండల ఎస్. జి .ఎఫ్. కార్యదర్శి బి .సత్యనారాయణ సంప్రదించాలని కోరారు సెల్ నెంబర్ 9440 45 84 94 ని పూర్తి వివరాలకు సంప్రదించాలి