ఇంద్రేశం మున్సిపాలిటీ కమిషనర్ కు మన్నె లక్ష్మి సన్మానం

సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీ కమిషనర్ మధుసూదన్ రెడ్డిని ఆత్మ కమిటీ డైరెక్టర్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మన్నె లక్ష్మి సన్మానించారు. శుక్రవారం ఇంద్రేశం కార్యాలయంలో కమిషనర్ మధుసూదన్ రెడ్డిని ఆత్మ కమిటీ డైరెక్టర్ మన్నె లక్ష్మి మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కమిషనర్ మధుసూదన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ముందుండి పని చేయాలని, స్థానికుల సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment