సంగారెడ్డి/సదాశివపేట, ఆగస్టు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): రంగారెడ్డి జిల్లా సంఘం కన్వీనర్ మన్నె వెంకటేష్ ముదిరాజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పులిమామిడి రాజు సదాశివపేట పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో శాలువా, పూలమాలతో సన్మానించి, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజులలో వెంకటేష్ మంచి నాయకుడిగా ఎదగాలని, ఆయన స్వచ్ఛందంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు అనాథ పిల్లలకు మంచి భోజనం అందించడం, వారి చదువుకు అవసరమగు నోటు పుస్తకాలను అందించడం, పేదవారికి అండదండగా నేనున్నానంటూ ప్రజాసేవలో ముందుకు కొనసాగుతున్న మన్నె వెంకటేష్ ను పులిమామిడి రాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖరప్ప, మాణిక్యం, సుభాష్ , సత్యం, బుసరెడ్డిపల్లి వెంకటేశం, మునిపల్లి రమేష్, మనోజ్, అనిల్ రాగం, అఖిల్ , తాలెల్మ రాము, సోమ శంకర్ తదితరులు పాల్గొన్నారు.