*సీసీఐ పత్తి కొనుగోళ్లను పరిశీలించిన మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న*
*జమ్మికుంట ఫిబ్రవరి 21 ప్రశ్న ఆయుధం*
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం రోజున సీసీఐ పత్తి కొనుగోళ్ళు పునః ప్రారంభం ఐనందున జమ్మికుంట పరిధిలో ఉన్న సీసీఐ కి కేటాయించబడిన సీతారామ కాటన్ ఇండస్ట్రీస్,సరిత కాటన్ ఇండస్ట్రీస్, రాజశ్రీ కాటన్ ఇండస్ట్రీస్ మూడు జిన్నింగ్ మిల్లులను జమ్మికుంట మార్కెట్ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న – సదానందం కొనుగోల్లను పరిశీలించారు. అనంతరం వారు రైతులతో మాట్లాడుతూ మీరు పండించిన పత్తిని ఆరబెట్టి, శుభ్రపరిచన పత్తిని తీసుకవస్తే సీసీఐ కోనుగోలు చేస్తారని నీళ్లు చల్లిన పత్తిని సీసీఐ వారు కొనుగోలు చేయరని రైతు సోదరులు గమనించి పుచ్చు, కౌడి పత్తిని తీసుకరాకుండా మంచి పత్తిని తీసుక వచ్చి ప్రభుత్వం మద్దతు ధరలు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఉన్నత శ్రేణికార్యదర్శి ఆర్ మల్లేశం , సీసీఐ సెంటర్ ఇంచార్జి పేరం చంద్రశేఖర్, ద్వితీయ శ్రేణి కార్యదర్శి ఎన్ రాజా, మార్కెట్ సిబ్బంది పత్తి వ్యాపారస్థులు తదితరులు పాల్గొన్నారు.