ఖమ్మం పత్తి మార్కెట్లో మార్కెట్ దొంగ చెస్ పుస్తకాల కలకలం……
మార్కెట్లో ఒక ట్రేడర్ కు సంబంధించిన చెస్ పుస్తకాలను దొంగతనంగా ముద్రించిన మరో ట్రేడర్….
దొంగతనంగా ముద్రించిన చెస్ బిల్లులతో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం,గుంటూరులోని ఒక ప్రముఖ సంస్థకు పత్తి ఎగుమతి…..
సదరు సంస్థ తన రాష్ట్రంలో ఇన్ ఫుట్ కోసం ప్రయత్నం చేయగా బిల్లులు ట్యాలి కాకపోవడంతో ఖమ్మం మార్కెట్లో విచారించగా వెలుగులోకి వచ్చిన దొంగ చెస్ బిల్లుల బాగోతం….
దొంగ చెస్ బిల్లుల విషయంలో అడ్డంగా దొరికిన సదరు వ్యాపారిపై కేసు పెట్టకపోగా,కాపాడేందుకు రాజీ ప్రయత్నాలు చేస్తున్న మార్కెట్ ముఖ్య అధికారి,పాలకవర్గం…..
గతంలో సదరు అధికారి పనితీరుపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికి తన రాజకీయ పలుకుబడితో విధుల్లో కొనసాగడంపై మార్కెట్ వర్గాల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి….