గుమ్మడిదలలో ఘనంగా మే డే వేడుకలు

సంగారెడ్డి/పటాన్ చెరు, మే 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని గుమ్మడిదల మండల కేంద్రంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ కార్మిక విభాగ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. మే డే అనేది కార్మికుల త్యాగాలను స్మరించుకునే రోజు మాత్రమే కాకుండా వారి హక్కుల కోసం పోరాడాల్సిన రోజుగా భావించాలని, కార్మికుల శ్రమ లేకుండా సమాజ అభివృద్ధి అసాధ్యం. రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక పథకాలను అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి కుమార్ గౌడ్, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, రమణారెడ్డి, దేవేందర్ రెడ్డి, మంద భాస్కర్ రెడ్డి, ఆంజనేయులు, బాల్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, సదానంద రెడ్డి, మైపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆకుల సత్యనారాయణ సూర్యనారాయణ చెంద్రారెడ్డి, జైపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మల్లేష్, అయుబ్, రాజు గౌడ్, రమేష్, పలువురు నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now