మెదక్/నర్సాపూర్, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా నూతన జిల్లా కమిటీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు పిలుపు మేరకు నూతన జిల్లా కమిటీని ఎనుకున్నట్లు మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ తెలిపారు. నూతన జిల్లా కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శిలు శ్రీనివాస్, రంజిత్ రెడ్డి, సంగసాని సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు బుచేష్ యాదవ్, తీగల శ్రీనివాస్, కె. నాగరాజు, కాజీపేట రాజేందర్, శంకర్ గౌడ్, నారాయణ రెడ్డి, జిల్లా కార్యదర్శులు మహేశ్వరి, కల్కి నాగరాజు, బిక్షపతి, బాదె బాలరాజు, అశోక్ సాదుల, సత్యనారాయణ, జిల్లా కోశాధికారి ఆంజనేయులు, కార్యాలయ కార్యదర్శి సాయికిరణ్ నియామకం అయ్యారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన వారికి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ మీపై నమ్మకంతో ఈ బాధ్యత ఇవ్వడం జరిగిందని, పార్టీ అభివృద్ధి కోసం క్రమ శిక్షణతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా బీజేపీ నూతన కమిటీ ఎన్నిక: మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్
Published On: August 16, 2025 5:20 pm